మోదీ సింగోల్‍కు ఎందుకు నమస్కరించ లేదు : అఖిలేష్ యాదవ్

మోదీ సింగోల్‍కు ఎందుకు నమస్కరించ లేదు : అఖిలేష్ యాదవ్

కొత్త పార్లమెంట్ బిల్డంగ్ లో స్పీకర్ ఛైర్  పక్కనే ఏర్పాటు చేసిన సింగోల్ (రాజదందాన్ని) తీసివేసి దాని స్థానంలో భారత రాజ్యంగాన్ని ఉంచాలని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ లోక్ స్పీకర్ స్పీకర్ ను కోరారు. ఈసారి లోక్ సభలో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశాక నరేంద్ర మోదీ సింగోల్ కు సమస్కరించలేదని అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. సింగోల్ రాచరికానికి అనవాలని, పార్లమెంట్ నుంచి దాన్ని తొలగించాలని గతంలో కూడా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.

తాజాగా కొత్త లోక్ సభ ఎన్నికైయ్యాక మూడవ రోజు సెషన్ లో కూడా సింగోల్ గురించి చర్చ జరిగింది. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్‌కు రాసిన లేఖలో RK చౌదరి సెంగోల్‌ను ప్రజాస్వామ్య భారతదేశంలో రాచరికం యొక్క అనాచార చిహ్నమని పేర్కొన్నారు. సెంగోల్ అంటే రాజ్ దండ అని అది రాజరిక పాలనకు ప్రతీక అని.. దేశానికి స్వతంత్రం వచ్చాక కూడా ఇలా నడుస్తుందా అని చౌదరి ప్రశ్నించారు.

రాజ్యాంగాన్ని కాపాడటానికి తాను సింగోల్‌ను పార్లమెంటు నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. దీనికి ఎన్డీయే నేతలు కూడా గట్టిగా బదులిచ్చారు. సింగోల్ తమిళ ప్రాంత సాంప్రదాయమని.. స్వతంత్రం ఇస్తూ.. సింగోల్ ను ఫస్ట్ ప్రధాన మంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూకు ఇచ్చి వెళ్లారని బీజేపీ ఎంపీలు అన్నారు. రాచరికానకి ప్రతీకే అయితే అప్పుడు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు అధికార పార్టీ నాయకులు.